
అఖండ విజయం తో నందమూరి బాలకృష్ణ మళ్లీ జోష్ పెంచాడు. ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య కు జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ మూవీ లో బాలయ్య కు దీటుగా విలన్ ను సెట్ చేసారు మేకర్స్.
ఆ విలన్ ఎవరో కాదు తమిళ్ స్టార్ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు. ఈ విషయాన్నీ తెలుపుతూ ఆయన పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. “ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి” వచ్చేసాడంటూ చిత్ర బృందం ఈ పోస్టర్ ను రివీల్ చేసింది. ఇక పోస్టర్ లో పవర్ ఫుల్ గా విజయ్ సిగరేట్ తాగుతూ కనిపించాడు.
- Advertisement -