Homeటాప్ స్టోరీస్రోడ్డున పడిన హీరో కుటుంబం

రోడ్డున పడిన హీరో కుటుంబం

Duniya vijay family problems againహీరో కం విలన్ అయిన దునియా విజయ్ కుటుంబం మరోసారి రోడ్డున పడింది . గతకొంత కాలంగా దునియా విజయ్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి కాగా నిన్న మరోసారి గొడవ జరగడంతో రచ్చ రచ్చ అయ్యింది. కన్నడ నాట హీరోగా , నెగెటివ్ క్యారెక్టర్ పోషించే ఆర్టిస్ట్ గా దునియా విజయ్ కి మంచి ఇమేజ్ ఉంది , అయితే ఇతడికి ఇద్దరు భార్యలు . మొదటి భార్య నాగరత్న కు మోనికా అనే 18 ఏళ్ల కూతురు కూడా ఉంది అయితే 2016 మొదటి భార్య ని దూరం పెడుతూ కీర్తి గౌడ ని పెళ్ళి చేసుకున్నాడు . దాంతో దునియా విజయ్ కి మొదటి భార్య కు గొడవలు మొదలయ్యాయి .

తాజాగా నిన్న దునియా విజయ్ రెండో భార్య అయిన కీర్తి గౌడని మొదటి భార్య నాగరత్న చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది . దాంతో కీర్తి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసింది . నాగరత్న మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో నాగరత్న లేకపోవడంతో ఆమె కూతురు మోనికా ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు దాంతో దునియా విజయ్ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు . నేరం చేసింది నాగరత్న అయితే శిక్ష అనుభవిస్తోంది నా కూతురు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . తల్లి చెప్పుడు మాటలు విని నా కూతురు కూడా నన్ను ద్వేశిస్తోందని వాపోతున్నాడు దునియా విజయ్ . పాపం రెండో పెళ్ళి ఏమంట చేసుకున్నాడో అప్పటి నుండి సుఖం ఏమో కానీ నరకం మాత్రం చూస్తున్నాడు ఈ నటుడు . నిత్యం గొడవలతో రోడ్డున పడుతుండటంతో దునియా విజయ్ పరువు మొత్తం మంటగలిసింది .

- Advertisement -

English Title: Duniya vijay family problems again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All