Homeటాప్ స్టోరీస్రాజమౌళి సినిమాలో ఆ హీరో నటించడం లేదట

రాజమౌళి సినిమాలో ఆ హీరో నటించడం లేదట

dr rajasekhar has not been part of rajamouli multistarer బాహుబలి సిరీస్ లతో సంచలనం సృష్టించిన వ్యక్తి ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్ , చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రంలో విలన్ గా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలన్నీ ఉత్తిదే అని తేలింది . అసలు ఈ వార్తలు వెలుగులోకి రావడానికి కారణం ఏంటో తెలుసా ……. రాజశేఖర్ – జీవిత ల కూతురు శివాని హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రానికి రాజమౌళి ని ఆహ్వానించడానికి వాళ్ళింటికి వెళ్లారు దాంతో ఈ పుకార్లు వచ్చాయి .

అదే విషయాన్నీ జీవిత చెప్పి రాజమౌళి సినిమాలో రాజశేఖర్ ని నటించమని కోరలేదని తేల్చి చెప్పింది . రాజమౌళి సినిమాలో విలన్ బలమైన వ్యక్తిగా చూపించడం కామన్ దాంతో రాజశేఖర్ విలన్ గా నటిస్తే బాగుంటుందని భావించి ఉంటారు అందుకే ఇలా వార్తలు వచ్చాయి కానీ తాజాగా తేలిన దాని ప్రకారం రాజశేఖర్ రాజమౌళి సినిమాలో నటించడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All