Homeటాప్ స్టోరీస్సాహో ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

సాహో ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

Saaho
Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా…… ఆగస్టు 15 న. అవును స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సాహో ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఆగస్టు 15న సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు కానీ గ్రాఫిక్స్ కారణంగా విడుదల ఆగస్టు 30 కి వాయిదపడింది.

దాంతో ఆగస్టు 15న సాహో ట్రైలర్ ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All