
సినిమాల్లో కంటే సోషల్ మీడియలోనే రచ్చ చేసేస్తోంది దిషా పటానీ. `లోఫర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బాలీవుడ్ హాట్ ఆటమ్ బాంబ్ `ఎంఎస్ థోనీ` బయోపిక్‌లోనూ మెరిసిన విషయం తెలిసిందే. లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన దగ్గరి నుంచి దిషా వరుస ఫొటోలతో ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది. సినిమాల కంటే బయటే పాపులర్ అవుతోంది.
మోహిత్ సూరి రూపొందిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ `మలంగ్`లో ఆదిత్యరాయ్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో రెచ్చిపోయి హాట్ హాట్ ముద్దుల్లో నటించి వార్తల్లో నిలిచింది. న్యూ జోనర్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా వుంటే తాజాగా దిషా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు యూత్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. బ్లాక్ గౌన్‌లో అందాల విందు చేస్తున్న దిష పిక్స్ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో దిష చేసిన ఫొటో షూట్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాలో ఆమెని ఫాలో అవుతున్న వారి సంఖ్య 29.5 మిలియన్. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల పోస్ట్ లు షేర్ చేసిన దిష 168 మందిని మాత్రమే ఫాలో అవుతోంది.
Credit: Instagram