Homeటాప్ స్టోరీస్మరదలితో సరసాలు ఆడుతున్న లీడర్

మరదలితో సరసాలు ఆడుతున్న లీడర్

Dirty political leaderకట్టుకున్న భార్యతో సంసారం చేస్తూ భార్య చెల్లెలుతో సరసాలు ఆడుతూ బాహ్యప్రపంచంలో లీడర్ గా వెలుగొందుతున్నాడు ఓ ప్రజాప్రతినిధి . అత్యంత జుగుప్సాకరమైన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది . స్టేషన్ ఘన్ పూర్ తాజా మాజీ ఎం ఎల్ ఏ , మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో ఓ మహిళ జరిపిన సంభాషణలో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల పేర్లు లీక్ అయ్యాయి కాగా అందులో ఒకరు ఎం ఎల్ సి కాగా మరొకరు ఎం ఎల్ ఏ అయితే ఆ ఇద్దరిలో ఒకరు భార్యతో సంసారం చేస్తూనే మరదలితో కూడా సరసాలు ఆడుతున్నట్లు ఓ మహిళకు చెప్పాడట ఆ విషయాన్నీ తాజాగా మాజీ ఎం ఎల్ ఏ కు చెప్పడం ఇదంతా ఫోన్ లో రికార్డ్ కావడం , ఆ సంభాషణలు అంతా మీడియాకి ఎక్కడం సంచలనం సృష్టిస్తోంది .

ఇక వరంగల్ జిల్లాలో వాట్సాప్ లలో వైరల్ అవుతోంది ఈ అసభ్యకరమైన సంభాషణ . ఈ ముగ్గురు కూడా ప్రజాప్రనిధులు కావడం అందునా అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందినవాళ్లు కావడంతో అధికార పార్టీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పి తేవడం ఖాయం . అయితే మరదలు అంటే చెల్లిలా . బిడ్డలా చూసుకునే ఆచారం హిందూ సంప్రదాయం కానీ ఆ సంప్రదాయానికి తూట్లు పెడుతూ సరసాలు ఆడుతున్న ప్రజాప్రతినిధిని ఏమనాలి ? వీళ్లా పాలకులు ? ప్రజా సేవకులు ? ఇలాంటి నయవంచనగాళ్ళని ఎన్నుకొని చట్టసభలోకి పంపిస్తే ప్రజా సమస్యలు పరిష్కరించకుండా సరసాలలో మునిగితేలుతున్నారని ప్రజలు అసహ్యించుకుంటున్నారు .

- Advertisement -

English Title: Dirty political leader

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All