Homeటాప్ స్టోరీస్పుట్టినరోజునే వినాయక్ చిత్రం ప్రారంభం..!

పుట్టినరోజునే వినాయక్ చిత్రం ప్రారంభం..!

Director VV Vinayak to play the hero in Dil Raju's upcoming production
Director VV Vinayak to play the hero in Dil Raju’s upcoming production

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడనే వార్త గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం వినాయక్ 5 నెలలుగా ఒళ్ళు తగ్గించే పనిలో బిజీగా వున్నారు.. ఇప్పటికే ఆయన కొంచెం ఫిట్ గా కూడా కనిపిస్తున్నారు.
శరభ ఫేమ్ నరసింహా రావు దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వినాయక్ పుట్టిన రోజు అక్టోబర్ 9న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ వినాయక్ స్వయంగా వెల్లడించారు. దిల్ చిత్రం తో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
అధినేత వెంకట రమణా రెడ్డి అలియాస్ (రాజు) ని నిర్మాతగా పరిచయం చేసారు వినాయక్. అప్పట్నుంచి దిల్ రాజుగా గా ప్రసిద్ధికెక్కారు. ఇప్పుడు తనని నిర్మాతగా పరిచయం చేసిన వినాయక్ ను హీరోగా లాంచ్ చేసి ఆ క్రెడిట్ మొత్తం దిల్ రాజు
కొట్టేయనున్నారు. ఈ విధంగా దిల్ రాజు వినాయక్ ఋణం తీర్చుకోనున్నారన్నమాట..! వినాయక్ డైరెక్షన్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అంతే రెమ్యునరేషన్ ని ఈ చిత్రంకోసం దిల్ రాజు ఆఫర్ చేసాడని.. ఈ చిత్రంలో వినాయక్ హీరోగా
నటించినందుకు గానూ ఏకంగా 9కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All