Homeటాప్ స్టోరీస్పెళ్ళైన తర్వాత ఎక్కువ చిత్రాలు అంగీకరిస్తోంది

పెళ్ళైన తర్వాత ఎక్కువ చిత్రాలు అంగీకరిస్తోంది

 director Shiva Nirvana to bring Naga Chaitanya and Samantha together012పెళ్లి అయినప్పటికీ సినిమాల్లో నటించడం మానేసేది లేదని పెళ్లి కి ముందే స్పష్టం చేసింది సమంత . అయితే పెళ్లి అయినా తర్వాత ఏకంగా ఆరు సినిమాల్లో నటించడానికి ఒప్పుకుందట ! అందులో మరో విశేషం ఏంటంటే నాగచైతన్య తో కలిసి చేసే సినిమా . పెళ్లి కి ముందు ఈ ఇద్దరూ కలిసి ఏ మాయ చేసావే , ఆటోనగర్ సూర్య , మనం చిత్రాల్లో నటించారు . ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి నటించలేదు కానీ పెళ్లి అయ్యాక ఆ ఇద్దరితో కలిసి సినిమా చేయాలనీ భావించాడు నాని డైరెక్టర్ .

నాని హీరోగా నటించిన నిన్ను కోరి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు . మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ తాజాగా నాగచైతన్య ని కలిసి ఓ కథ ని చెప్పాడట . రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కే ఆ కథ నాగచైతన్య కు బాగా నచ్చిందట దాంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ! అయితే ఇందులో మీకు జతగా సమంత అయితే బాగుంటుందని చెప్పాడట ! ఇంకేముంది అనందంగా ఒప్పుకున్నారు . త్వరలోనే ఈ పెళ్ళైన జంట ని మరోసారి స్క్రీన్ పై చూడనున్నారు ప్రేక్షకులు . ఈ సినిమా నే కాకుండా ఇంకా స్పీడ్ పెంచి మరో అయిదు సినిమాల్లో కూడా నటించడానికి సమాయత్తం అవుతోందట సమంత . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All