Homeగాసిప్స్బస్ డ్రైవర్ కొడుకట ఈ స్టార్ హీరో

బస్ డ్రైవర్ కొడుకట ఈ స్టార్ హీరో

Director Rajamouli revealed star hero yash secret
yash

కొడుకు స్టార్ హీరో అయినప్పటికీ అతడి తండ్రి మాత్రం ఇంకా బస్ డ్రైవర్ గానే కొనసాగుతున్నాడు . ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు కన్నడంలో స్టార్ హీరో . ఇంతకీ స్టార్ హీరో అయిన బస్ డ్రైవర్ కొడుకు ఎవరో తెలుసా …….. కన్నడ స్టార్ హీరో యష్ . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకైన యష్ సినిమాల్లోకి వచ్చి మెల్లి మెల్లిగా ఒక్కో హిట్ కొడుతూ  స్టార్ డం అందుకున్నాడు . ఇప్పుడు యష్ కన్నడ నాట హవా సృష్టిస్తున్నాడు . అయితే ఈ విషయాన్నీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రివీల్ చేసాడు .

యష్ హీరోగా నటించిన భారీ చిత్రం ” కేజిఎఫ్ ” కన్నడంలోనే కాకుండా తెలుగు , తమిళ బాషలలో కూడా విడుదల అవుతోంది ఈనెల 21న . దాంతో నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్ సి కన్వెన్షన్ లో కేజీఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఈ వేడుకకు ముఖ్య అథితిగా ఎస్ ఎస్ రాజమౌళి వచ్చాడు . ఆ వేడుకలోనే యష్ ప్రస్థానం గురించి , అతడు ఓ సాధారణ డ్రైవర్ కొడుకు అన్న విషయం గురించి చెప్పాడు . అయితే కొడుకు ఎంత స్టార్ హీరో అయినప్పటికీ యష్ తండ్రి మాత్రం బస్ డ్రైవర్ ఉద్యోగాన్ని మాత్రం వదలలేదట అదే అతడి గొప్పతనం .ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా ఈనెల 21న భారీ ఎత్తున సాయి కొర్రపాటి  విడుదల చేస్తున్నారు  .

- Advertisement -

English Title: Director Rajamouli revealed star hero yash secret

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All