
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. మారుతీ తండ్రి దాసరి వన కుచల రావు (76) బుధువారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన.. మచిలీపట్నంలోని తన స్వగృహం నందున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మారుతీ సినిమాల విషయానికి వస్తే..డైరెక్టర్ గా మొదట్లో యూత్ సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈయన..తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేయడం మొదలుపెట్టారు. బాబు బంగారం , భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే , మహానుభావుడు వంటి వరుస ఫ్యామిలీ మూవీస్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేసాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. జులై 01 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రభాస్ తో ఓ మూవీ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.