Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ కి క్రిష్ సెట్ అయ్యాడు

ఎన్టీఆర్ బయోపిక్ కి క్రిష్ సెట్ అయ్యాడు

director krish joins ntr biopicఎన్టీఆర్ బయోపిక్ కి ఎట్టకేలకు దర్శకుడు సెట్ అయ్యాడు , ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ? అని అనుకుంటున్నారా ? ఇంకెవరు క్రిష్ . బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ అందించిన క్రిష్ జాగర్లమూడి మళ్ళీ బాలయ్య తో కలిసి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్ ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు . తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకోవడంతో పలువురుని అనుకున్నాడు బాలయ్య కానీ ఎవరు కూడా ఆ బయోపిక్ కు దర్శకత్వం వహించడానికి ముందుకు రాలేదు దాంతో బాలయ్యే డైరెక్షన్ చేయాలనీ అనుకున్నాడు .

అయితే మహానటి చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ అంతకు మించి ఉండాలని ఏమాత్రం తగ్గినా పరువు పోతుందని భావించి క్రిష్ తో చర్చలు జరిపారు . మీనమేషాలు లెక్కించిన మీదట క్రిష్ ఆమోదముద్ర వేసాడు . ఇంకేముంది బాలయ్య ఇప్పుడే సంతోషంగా ప్రకటించాడు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ అని .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All