Homeటాప్ స్టోరీస్సినిమా హిట్ కాకపోతే గొంతుకోసుకుంటాడట

సినిమా హిట్ కాకపోతే గొంతుకోసుకుంటాడట

Director karthik subbaraju sensational comments on Rajini's Petta ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నా గొంతు కోసుకుంటా …… కావాలంటే 7 ఓ క్లాక్ బ్లెడ్ తీసుకొని దగ్గరే పెట్టుకోండి మాట మీద నిలబడతా! అంటూ సంచలనం సృష్టించాడు హాస్య నటుడు , నిర్మాత బండ్ల గణేష్ . అయితే తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే . కట్ చేస్తే ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఓ దర్శకుడు సినిమా హిట్ కాకపోతే నా గొంతు కోసుకుంటా అంటూ సవాల్ విసిరాడు .

 

- Advertisement -

సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన చెన్నై లో జరిగింది . ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమా గురించి . ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు , రజనీకాంత్ అంటే పడి చచ్చిపోయే డైరెక్టర్ అన్నమాట . రజనీకాంత్ కు వీరాభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజు పేట సినిమా హిట్ కాకపోతే నా గొంతు కోసుకుంటా అని సవాల్ విసిరాడట తమిళనాడులో . గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి .అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే 2. ఓ హిట్ అయ్యింది . అయితే కమర్షియల్ హిట్ మాత్రం కాదు దాంతో రజనీ నటించిన ముత్తు , నరసింహా , బాషా చిత్రాల స్థాయిలో ఈ పేట హిట్ అవుతుందని సవాల్ చేస్తున్నాడు . చూడాలి మరి జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది . హిట్ అవుతుందా ? కార్తీక్ గొంతు బలి తీసుకుంటుందా ?

English Title: Director karthik subbaraju sensational comments on Rajini’s Petta

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All