Homeటాప్ స్టోరీస్సూర్య ద‌ర్శ‌కుడి కొత్త అడుగు!

సూర్య ద‌ర్శ‌కుడి కొత్త అడుగు!

సూర్య ద‌ర్శ‌కుడి కొత్త అడుగు!
సూర్య ద‌ర్శ‌కుడి కొత్త అడుగు!

క‌రోనా జ‌న‌జీవితాన్ని స్థ‌భింప‌జేసినా చాలా పాఠాలు నేర్పుతోంది. క‌రోనాకి ముందు జీవితానికి… త‌రువాత జీవితానికి తేడా చూపిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా వ‌ర‌కు అన్ని రంగాలు బంద్‌ని పాటిస్తున్నాయి. సినిమా రంగం మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కుంటోంది. ఇప్ప‌టికే రిలీజ్ కు సిద్ధంగా వున్న చిత్రాలు లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? ఎప్పుడు థియేట‌ర్ల‌కు ప‌ర్మీష‌న్ ఇస్తారా అని ఎదురుచూస్తున్నాయి.

ఇదిలా వుంటే లాక్‌డౌన్ త‌రువాత సీనీ రంగంలో స‌మ‌గ్ర మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అందులో అత్యంత ప్ర‌ధానంగా బ‌డ్జెట్‌, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల రెమ్యున‌రేష‌న్‌ల‌లో భారీగా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇంత‌కు ముందు త‌ర‌హాలో భారీగా పారితోషికాలు ఇవ్వ‌డం కుద‌ర‌దు. బ‌డ్జెట్‌లు కూడా భారీగా త‌గ్గించే అవ‌కాశ‌మే అత్య‌ధికంగా క‌నిపిస్తోంది.

- Advertisement -

దీనికి చాలా మంది సిద్ధ‌ప‌డాల‌ని ఇప్ప‌టికే రాజ‌మౌళి లాంటి ద‌ర్‌శ‌కులు చెబుతున్నారు. ఇండియాలోనే మొట్ట‌మొద‌టి సారిగా త‌న పారితోషికాన్ని త‌గ్గించుకుంటున్నానంటూ త‌మిళ హీరో విజ‌య్ ఆంటోనీ ఇటీవ‌ల వెల్ల‌డించారు. తాజాగా యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి త‌న పారితోషికాన్ని త‌గ్గించుకుంటున్నానంటూ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సూర్య‌. విక్ర‌మ్‌ల‌తో హ‌రి యాక్ష‌న్ చిత్రాలు తెర‌కెక్కించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All