
హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా విశ్వక్సేన్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ తో ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే.. ఇటీవలే ‘దాస్కా ధమ్కీ’ అనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే పలు కారణాల రీత్యా చిత్ర దర్శకుడు నరేశ్ తప్పుకొన్నాడు. దీంతో ఈ సినిమాను స్వయంగా తానే డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్గా నివేదా పేతురాజ్ నటించనుంది. ఈరోజు నుండి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకోబోతున్నట్లు తెలిపారు.
- Advertisement -