Homeగాసిప్స్బాలకృష్ణ తో దిల్ రాజు మూవీ..?

బాలకృష్ణ తో దిల్ రాజు మూవీ..?

అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ చిత్రం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్నాడు. ఎప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ ఆలా పెండింగ్ లో ఉంది. ఇక దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయనున్నాడనే వార్త బయటకు వచ్చింది.

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కు గుర్తింపు ఉంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేయాలనీ రాజు కు కోరిక. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రాన్ని చేసి ఓ కోరిక తీర్చుకోగా..బాలయ్య తో కూడా ఓ సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాడు. తాజాగా బాలయ్య కు కరెక్ట్ గా సెట్ అయ్యే కథను సిద్ధం చేసాడట. ఈ కథ ను ప్రముఖ రైటర్ బివిఎస్ రవి రాసాడట. త్వరలోనే ఈ కథను బాలయ్య కు వినిపించాలని రాజు చూస్తున్నాడట. ఒకవేళ బాలయ్య ఓకే చెపితే ..అనిల్ సినిమా అవ్వగానే మొదలుపెట్టాలని భావిస్తున్నాడట. మరి రవి నే డైరెక్టర్ గా పెట్టి సినిమా చేస్తాడా..లేక మరో డైరెక్టర్ ను ఎంచుకుంటాడా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం ఎఫ్ 3 రిలీజ్ బిజీ లో దిల్ రాజు ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All