Homeటాప్ స్టోరీస్రీమేక్ చేయాలంటే నాకు భ‌యం: దిల్‌రాజు!

రీమేక్ చేయాలంటే నాకు భ‌యం: దిల్‌రాజు!

Dil raju emotional speech at jaanu pre release
Dil raju emotional speech at jaanu pre release

దిల్‌రాజు నిర్మిస్తున్న తొలి రీమేక్ `జాను`. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `96` చిత్రాన్ని తెలుగులో `జాను` పేరుతో రీమేక్ చేస్తున్నారు. స‌మంత‌, శ‌ర్వానంద్ హీరో, హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భ‌గా శ‌నివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌క్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు ఎమోష‌న‌ల్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`మా బ్యాన‌ర్ స్థాపించి 17 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల జ‌ర్నీలో ఎప్పుడూ రీమేక్ చిత్రాన్ని నిర్మించ‌లేదు. మా సంస్థ‌లొ వ‌స్తున్న తొలి రీమేక్ ఇది. రీమేక్ సినిమాలు చేయాలంటే నాకు భ‌యం. ఎందుకంటే ఒరిజిన‌ల్ ఫీల్ మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం. త‌మిళంలో `96` మూవీ రిలీజ్‌కు ఒక నెల ముందే చూశాను. వెంట‌నే ప్రొడ్యూస‌ర్‌కి రీమేక్ హ‌క్కుల కోసం చెక్ ఇచ్చేశాను. అంత‌లా న‌చ్చింది. సినిమాలో వున్న కంటెంట్‌తో నా గుండె బ‌రువెక్కింది. ఆ స‌మ‌యంలో  `ఎంసీఏ` షూటింగ్ జ‌రుగుతోంది.
`96`ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌ని నానితో చెబితే త‌ను చూస్తాన‌న్నాడు. సినిమా చూసి క్లాసిక్ సినిమా అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అప్పుడే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను` అన్నారు దిల్ రాజు.

- Advertisement -

స‌మంత ఈ మ‌ధ్య చేస్తున్న సినిమాల సెలెక్ష‌న్ సూప‌ర్ గా వుంది. అందుకే `జాను` పాత్ర‌లో ఆమెని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేక‌పోయాను. ఈ చిత్రానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్నింటిని త‌ట్టుకుని సినిమాని పూర్తి చేశాం. సినిమా చూసిన ప్రేక్ష‌కులు కొన్ని రోజుల పాటు ఈ సినిమా హ్యాంగోవ‌ర్‌లోనే వుండిపోతారు. అంత‌లా ప్ర‌భావితం చేస్తుంది. ఈ నెల 7న నేను చెప్పిన మాట‌లు నిజాల‌వుతాయి` అని కాన్ఫిడెంట్‌తో చెబుతున్నారు దిల్ రాజు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All