Homeటాప్ స్టోరీస్`దిల్ బెచారా` మూవీ రివ్యూ

`దిల్ బెచారా` మూవీ రివ్యూ

`దిల్ బెచారా` మూవీ రివ్యూ
`దిల్ బెచారా` మూవీ రివ్యూ

న‌టీన‌టులు :  సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌, సంజ‌న సంఘీ, సైఫ్ అలీఖాన్‌, స్వ‌స్థిక ముఖ‌ర్జీ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శక‌త్వం :  ముఖేష్ చ‌బ్రా
నిర్మాణం :  ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌
సంగీతం : ఏ.ఆర్‌. రెహమాన్‌
ఓటీటీ రిలీజ్ :  డిస్నీ హాట్ స్టార్‌
రిలీజ్ డేట్ :  జూలై 24, 2020

స‌రిగ్గా 42 రోజుల క్రితం అంటే జూన్ 14న సినీ ప్ర‌పంచాన్ని నివ్వెర ప‌రిచారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌. త‌న ఏడేళ్ల సినీ జీవితానికి 35 ఏళ్ల జీవితానికి వీడ్కోలు ప‌లికి ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. సుశాంత్ చ‌నిపోయి నెల రోజులు దాటినా ఇప్ప‌టికీ అత‌ని మ‌ర‌ణంపై బాలీవుడ్‌లో రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇదిలా వుంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టించిన చివ‌రి చిత్రం `దిల బెచారా` ఈ 24న డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌లైంది. ఈ సినిమా ఎలాంటి వుంద‌న్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
థైరాయిడ్ క్యాన్స‌ర్‌తో కిజీ (సంజ‌న సంఘీ) బాధ‌ప‌డుతుంటుంది. జీవితం బోర్‌గా ఫీల‌వుతూ వుంటుంది. అలాంటి ఆమె జీవితంలోకి  మ‌న్నీ ( సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) ప్ర‌వేశిస్తాడు. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న మ‌న్సీకి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌లా స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవాల‌ని కోరిక . దాని కోసం ఫ్రెండ్‌తో క‌లిసి ఓ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తాడు. అందులో హీరోయిన్‌గా న‌టించాల‌ని కిజీని ఒప్పిస్తాడు. ఈ ప్ర‌యాణంలో కిజీ, మ‌న్నీ ప్రేమ‌లో ప‌డ‌తారు. ఇదే స‌మ‌యంలో కిజీకి వున్న కోరిక మ‌న్నీకి తెలుస్తుంది. గేయ ర‌చ‌యిత అభిమ‌న్యు వీర్ (సైఫ్ అలీ ఖాన్‌) ని క‌ల‌వాల‌న్న‌ది కిజీ కోరిక‌. ఆ కోరిక‌ని నెర‌వేర్చే క్ర‌మంలో మ‌న్నీ గురించి తెలిసిన నిజ‌మేంటీ?  కిజి, మ‌న్నీలో ఎవ‌రు చ‌నిపోయారు? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చివ‌రి చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై అంద‌రి దృష్టిప‌డింది. తెర‌పై ఎంత మంది వున్నా ప్ర‌తీ ఒక్క‌రి దృష్టి సుశాంత్ పైనే వుంటుంది. అత‌ని న‌ట‌నే ప్ర‌ధానంగా చూస్తారు. సినిమా చూస్తున్న వాళ్లు సుశాంత్‌తో న‌వ్వి, భావోద్వేగానికి లోనై ఏడ్చేయ‌డం ఖాయం. అంత‌లా త‌న పాత్ర‌ని సుశాంత్ ర‌క్తిక‌ట్టించారు. మ‌న ప‌క్కింటి కుర్రాడే ఇంత బాగా చేస్తున్నాడే ఎందుకు చ‌నిపోయాడు అని మ‌న‌సులో అనుకోని వారంటూ వుండ‌రు. సుశాంత్ చ‌నిపోవ‌డంతో సినిమా చూస్తున్న వాళ్లు అత‌ని పాత్ర‌తో స‌హానుభూతిని పొందుతూ భావోద్వేగానిఇక లోన‌వుతారు. ప్ర‌ధానంగా చెప్పాలంటే సుశాంత్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి వెండితెర‌కు స‌గ‌ర్వంగా వీడ్కోలు ప‌లికాడ‌ని చెప్పొచ్చు. సినిమా క‌థ‌లోని టెంపో, ఎమోష‌న్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా న‌టి సంజ‌న సంఘీ న‌టించింది. సైఫ్ క‌నిపించింది ఒక్క స‌న్నివేశ‌మే అయినా ఆక‌ట్టుకుంటుంది.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

ప్ర‌ముఖ ర‌చ‌యిత జాన్ గ్రీన్ ర‌చించిన `ది ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్` ఆధారంగా ఇదే పేరుతో హాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఆధారంగా తెర‌కెక్కిన చిత్ర‌మే `దిల్ బెచారా`. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `గీతాంజ‌లి` ఛాయల్లో క‌నిపించే ఈ చిత్రం ఇది. గొప్ప కథ కాక‌పోయినా పాత్ర‌ల‌తో ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ముఖేష్ చ‌బ్రా. ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణ విలువ‌లు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. సుశాంత్ చివరి సినిమా కావ‌డం కూడా ఈ చిత్రంపై ప్ర‌త్యే దృష్టి ఏర్ప‌డేలా చేసింది. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ని క్రియేట్ చేసింది. కెమెరా వ‌ర్క్ బాగుంది.

విశ్లేష‌ణ‌:

`దిల్ బెచారా` సింపుల్ ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ. సుశాంత్ రాజ్ పుత్ అద్భుత న‌ట‌న‌, ఆయ‌న స్క్రీన్ ప్ర‌జెన్స్, అందుకు త‌గ్గ స్థాయిలో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ , ఏ. ఆర్ రెహ‌మాన్ అద్భుత సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. కొన్ని సినిమాలు మాత్ర‌మే రేటింగ్ కి లోబ‌డి వుంటాయి కానీ కొన్ని మాత్రం రేటింగ్‌ల‌కు అవేగా వుంటాయి. ఆ కోవ‌కు చెందిన సినిమా ఇది.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All