Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్దియా మీర్జాని కూడా రేప్ చేయబోయాడట

దియా మీర్జాని కూడా రేప్ చేయబోయాడట

Dia mirza says metoo హైదరాబాద్ మూలాలున్న బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా దర్శకుడు సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. నా పట్ల కూడా సాజిద్ ఖాన్ క్రూరంగా ప్రవర్తించాడని , అయితే నా ముందు అతడి ఆటలు సాగలేదని అంటోంది దియా మీర్జా. సాజిద్ ప్రవర్తనతో నేను షాక్ అయ్యానని ,నా లాంటి హీరోయిన్ నే లైంగికంగా వేధించాడంటే పలువురిని ఇబ్బంది పెట్టడం పెద్ద మ్యాటర్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది దియా మీర్జా. సాజిద్ ఖాన్ పై పలువురు సినిమా రంగానికి చెందినవాళ్ళు లైంగిక ఆరోపణలు చేస్తున్న తరుణంలో దియా మీర్జా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -

హౌజ్ ఫుల్ 4 చిత్రానికి తాజాగా దర్శకత్వం వహిస్తున్నాడు సాజిద్ ఖాన్. అయితే సాజిద్ ఖాన్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ నిలిపి వేయాల్సిందిగా నిర్మాతలను కోరాడు. లైంగిక ఆరోపణల నిజం నిగ్గు తేలిన తర్వాతే మళ్లీ షూటింగ్ అంటున్నాడు అక్షయ్. బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సాజిద్ ఖాన్ పై నిన్న మొన్నటి వరకు అంతగా పేరులేని వాళ్ళు ఆరోపణలు చేశారు కానీ దియా మీర్జా తాజాగా ఆరోపణలు చేయడంతో సాజిద్ ఖాన్ కు కొన్నాళ్ళు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

English Title: Dia mirza says metoo

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts