Homeటాప్ స్టోరీస్తగ్గిదేలే అంటున్న రవితేజ

తగ్గిదేలే అంటున్న రవితేజ

Dhamaka Wrapped up the 4th Schedule
Dhamaka Wrapped up the 4th Schedule

చిత్రసీమలో అడుగుపెట్టినప్పటి నుండి రవితేజ స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. తన ఏజ్ ను సైతం తక్కువ చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వస్తున్నాడు. హిట్ వచ్చిన ప్లాప్ వచ్చిన అదే స్పీడ్ కొనసాగిస్తూ ఎక్కడ ఆగకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ అందుకున్న రవితేజ..రీసెంట్ గా ఖిలాడీ గా వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. అయినప్పటికీ రిలాక్స్ కాకుండా మిగతా సినిమాల ఫై ఫోకస్ చేసి వరుసగా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాల్లో ధమాకా ఒకటి.

త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ తాజాగా నాల్గో షెడ్యూల్ సైతం పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ర‌వితేజ, డైరెక్ట‌ర్ అండ్ చిత్ర‌యూనిట్ లొకేష‌న్‌లో దిగిన ఫొటోను షేర్ చేసి నాల్గో షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయినట్లు తెలిపారు.

- Advertisement -

ఈ షెడ్యూల్ లో ఫైట్ మాస్ట‌ర్ రామ్-ల‌క్ష్మ‌ణ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ లో పెళ్లి సంద‌D ఫేం శ్రీలీల రవితేజ సరసన జోడి కడుతుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All