
మాస్ మహారాజా రవితేజ , పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల జంటగా త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో తెరకెక్కుతున్న కమెండే ఎంటర్టైనర్ ధమాకా. బెజవాడ ప్రసన్న కుమార్ రచించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే నాల్గు షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..తాజాగా స్పెయిన్ లో సాంగ్ షూట్ లో బిజీ గా ఉన్నారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో రవితేజ , శ్రీలీల లపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీని తాలూకా పిక్ ను ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ పంచుకున్నారు. త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ పరుగులు పెడుతున్నారు. ఇక రవితేజ రీసెంట్ గా ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.