Homeటాప్ స్టోరీస్దేవుడు వరమందిస్తే హిట్ కొడతాడట

దేవుడు వరమందిస్తే హిట్ కొడతాడట

అపుడెపుడో పద్దెనిమిదేళ్ల క్రితం ఓ ఊపు ఊపేసిన పాట ” దేవుడు వరమందిస్తే ….. నేనే నిన్నే కోరుకుంటాలే ” అనే పాట . 2001లో రిలీజ్ అయిన 6టీన్స్ సూపర్ హిట్ కాగా ఆ చిత్రం లోని దేవుడు వరమందిస్తే కుర్రాళ్ళ ని పిచ్చ పిచ్చగా ఆకట్టుకుంది . అయితే ఆ పాటలోని ” దేవుడు వరమందిస్తే ” అనే పల్లవి ని తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . తాజాగా ఈ హీరో ప్రేమ కథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ దర్శకతంలో నటిస్తున్న విషయం తెలిసిందే .

అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది . అగ్ర నిర్మాత కె ఎస్ రామారావు తనయుడు వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఇక సూపర్ హిట్ ఆల్బమ్ లను అందిస్తున్న గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు . కాగా సాయి ధరమ్ తేజ్ గతకొంత కాలంగా భారీ అపజయాలను ఎదుర్కొంటు రేసులో వెనుకబడిపోయాడు . దాంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు . ప్రేమకథా చిత్రం కావడంతో హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు కాకపోతే దేవుడు వరమందిస్తే తప్పకుండా హిట్ కొడతాడట . మరి దేవుడు వరమందిస్తాడా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All