
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కొంచెం స్లో అయినట్లు కనిపిస్తున్నా కొన్ని ఆసక్తికర సినిమాలను అయితే చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శర్వానంద్ దేవికి సోషల్ మీడియాలో వెల్కమ్ చెప్పాడు.
దీనికి దేవి శ్రీ ప్రసాద్ రెస్పాండ్ అయ్యాడు. “థాంక్యూ డియర్ బ్రదర్ శర్వానంద్. కిషోర్ తిరుమల నరేట్ చేసిన స్క్రిప్ట్ హిలేరియస్ గా ఉంది. అలాగే ఎంటర్టైనింగ్, రొమాంటిక్, టచింగ్ గా ఉంది. అదరగొడదాం శర్వా” అని ట్వీట్ చేసాడు.
శర్వానంద్ తో కలిసి దేవి పనిచేయడం ఇదే తొలిసారి. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో శర్వానంద్ కీలక పాత్ర పోషించాడు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
Heyyyyy Dear Rashmika @iamRashmika ????????????
Thank you for the warm welcome????????
YESS YESS YESS !!
Lets Keep Rockinggg…????????????#AadavaalluMeekuJohaarlu @ImSharwanand @DirKishoreOffl
@sujithsarang @SLVCinemasOffl https://t.co/siddVbp8J8— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 22, 2021