Homeటాప్ స్టోరీస్దేశ‌దిమ్మ‌రి పాటలు విడుదల

దేశ‌దిమ్మ‌రి పాటలు విడుదల

deshadimmari audio launchత‌నీష్ హీరోగా స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) “దేశ దిమ్మరి” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. . ఈ చిత్రంతో త‌నీష్ త‌న‌లోని గాయ‌కుడిని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. హే పైసా అంటూ డ‌బ్బు పై వ‌చ్చే ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ని త‌నీష్ స్వ‌యంగా ఆల‌పించాడు. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదలయ్యాయి. సుమన్ ,రాజ్ కందుకూరి , వీరినాయుడు, ముత్యాల రాందాస్, విజయ్ కుమార్, రామ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి పాటలను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… నాతో ప‌నిచేసిన టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్‌. నాకు ఇంత మంచి అవ‌కాశం అందించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు. లిరిసిస్ట్ పార్వ‌తి చంద్‌గారు మాట్లాడుతూ… ఈ సినిమాలో 4 పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. క‌థ చాలా బావుంది త‌నీష్ చాలా మంచి ఆర్టిస్ట్ త‌న‌కి ఈ చిత్రం సూప‌ర్‌హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

స్టంట్‌మాస్ట‌ర్ అంజి మాట్లాడుతూ…ఇందులో చాలా త‌క్కువ టైంలో చేశాము. త‌నీష్‌గారు చాలా కోప‌రేట్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

- Advertisement -

కెమెరామెన్ మ‌ల్లికార్జున నార‌గాని మాట్లాడుతూ…త‌నీష్‌గారితో నేను ప‌నిచెయ్య‌డం మొద‌టిసారి. నేను ఈ చిత్రానికి న్యాయం చేశాన‌నే అనుకుంటున్నాను. మ‌రి సినిమా చూసి మీరే చెప్పాలి.

ఆర్టిస్ట్ స‌మ్మెట‌ గాంధీ షిరీన్‌మాట్లాడుతూ… ఈ చిత్రంలో అవ‌కాశం ఇచ్చినందుకు డైరెక్ట‌ర్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు. లిరిక్స్ చాలా బాగా కుదిరాయి. ఈ చిత్రం డైరెక్ట‌ర్‌కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

విజ‌య్ కుమార్ మాట్లాడుతూ… న‌గేష్‌గారు ఎప్ప‌టినుంచో తెలుసు ముందు ముందు ఇంకా స‌క్సెస్‌కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

అయ్య‌ప్ప మాట్లాడుతూ… 32 అడుగుల ఎత్తు ఇసుక పైన స‌త్య‌నారాయ‌ణ‌స్వామి వారి దేవాల‌యాన్ని క‌ట్టాను. న‌గేష్‌గారి సినిమా చూసి న‌చ్చి క‌ట్టాను.

వీర్‌నాయుడు మాట్లాడుతూ… పాట‌లు చాలా రిచ్‌గా చాలా బావున్నాయి. అంద‌రికి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఫిలింఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ మాట్లాడుతూ… న‌గేష్ గురించి స‌త్య‌నారాయ‌ణ‌స్వామే చెప్పాలి. ఆ పాట‌లు చూసి ఎట్రాక్ట్ అయి 10 ప్రిట్లు తియ్యాల‌నుకున్న వాడ్ని 90 ప్రింట్లు వేశాం. కొన్ని థియేట‌ర్స్ మాత్ర‌మే అనుకున్న వాళ్ళం థియేట‌ర్లు కూడా పెంచాం. త‌నీష్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సుమ‌న్ ఎంత మందికి ఎంక‌రేజ్ ఇచ్చారో అంద‌రికి తెలుసు దేశ‌దిమ్మ‌రి మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ… నేను మొద‌టి నుంచి క‌నెక్ట్ అయ్యాను అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
రామ్‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ… న‌గేష్ ప్రొడ్యూస‌ర్ల డైరెక్ట‌ర్‌. ఎందుకంటే ప్రొడ్యూస‌ర్ బావుండాల‌ని కోరుకుంటాడు. సినిమా మొద‌లెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి దాని బాగోగుల‌న్నా ద‌గ్గ‌రుండి డ‌బ్బులు వ‌చ్చే వ‌ర‌కు చూసుకునే వ్య‌క్తి. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. త‌నీష్‌కి ఆల్ ద బెస్ట్ బిగ్‌బాస్‌లో ఉండ‌డం వ‌ల్ల ఆడియ‌న్స్‌కి త‌నీష్ బాగా ద‌గ్గ‌ర‌య్యారు. సుమ‌న్‌గారు నా ఫేవ‌రెట్ హీరో. ఎందుకంటే నా మొద‌టి చిత్రం ఆయ‌న‌తోనే తీశాను. న‌న్ను చాలా బాగా చూసుకుంటారు.

రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… ఇప్పుడు చిన్న సినిమాల ప‌రంప‌ర న‌డుస్తుంది. కంటెంట్ ఇంపార్టెట్ న‌గేష్ గురించి అంద‌రూ చెప్పారు. వెరీ గుడ్‌. నేను నిర్మాత‌ను మెచ్చుకుంటున్నాను. ఈ సినిమాకోసం ముందుకు వ‌చ్చినందుకు. విజ‌య ప‌రంప‌ర సాగాల‌ని ఇది మంచి స‌క్సెస్ అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. త‌నీష్‌ని బాగా అబ్‌జ‌ర్వ చేశాను. ఇంత చిన్న కుర్రాడిలో ఇంత మెచ్యూరిటీ ఉంది.

ప్రొడ్యూస‌ర్ గోయ‌ల్ మాట్లాడుతూ… నాతో ప‌నిచేసిన వారంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు. మీ అంద‌రి ఆశీస్సులు ఈ చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ న‌గేష్ మాట్లాడుతూ… సినిమా గురించి నేను ఎక్కువ చెప్ప‌ను. సినిమా చెపుతుంది. పంజాబ్‌, హ‌రియానాలో షూట్ జ‌రిగింది. కొండ‌లు ఎక్క‌డం దిగ‌డం చాలా క‌ష్టం నేను ఈ సినిమా కోసం అంద‌రిని చాలా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా త‌నీష్‌ని, కెమెరామెన్స్‌ని చాలా ఇబ్బంది పెట్టాను న‌న్ను క్ష‌మించాలి. పెద్ద సినిమాల‌తో పాటు మా సినిమాని కూడా ఎంక‌రేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

సుమ‌న్ మాట్లాడుతూ… ముందుగా ప్రొడ్యూస‌ర్‌గారికి నా కృజ్ఞ‌త‌లు తెలుగు సినిమా చెయ్యాల‌ని ఐడియా వ‌చ్చినందుకు. ఆయ‌న‌కు భాష రాదు ఈ రాష్ర్టం కాక‌పోయినా సినిమా తియ్య‌డం కోసం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డైరెక్ట‌ర్ అడిగిన వ‌న్నీ అందిస్తూ వ‌చ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఈ చిత్రంలో చాలా ఛాలెంజింగ్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో లొకేష‌న్ చాలా ఇంపార్టెంట్ స్ర్కీన్‌మీద చూస్తే అర్ధ‌మ‌వుతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. హీరో త‌నీష్ కూడా చాలా బాగా న‌టించాడు. మ‌ళ్ళీ న‌గేష్‌గారితో చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో త‌నీష్ మాట్లాడుతూ… పెద్ద‌వాళ్ళు నా గురించి చెప్పిన మాట‌ల‌న్నిటికీ నా కృత‌జ్ఞ‌త‌లు. నేను బ‌య‌ట‌కొచ్చిన త‌ర్వాత చాలా ఆనందంగా ఉన్నాను మీడియాతో క‌లిసినందుకు.ఈ రోజు ఆడియో విడుద‌లైంది. పాట‌లు చాలా బావున్నాయి. ముందుగా మా ప్రొడ్యూస‌ర్ గారు చాలా గ్రేట్ తెలుగు తెలియ‌కుండా ఈ సినిమా చెయ్య‌డానికి ఒప్పుకున్నారు. ఆయ‌న ఈ సినిమా కోసం ఏం కావాల‌న్నా ఇచ్చారు. నాతో పాటు న‌టించిన టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ఇందులో చేసిన ప్ర‌తి ఒక్క‌రు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఎందుకంటే ఈ షూటింగ్ మొత్తం హిల్ స్టేషన్స్‌లో జ‌ర‌గ‌డంవ‌ల్ల కెమెరాలు ప‌ట్టుకుని ఎక్క‌డం దిగ‌డం చాలా క‌ష్టం. ఈ చిత్ర కాన్పెప్ట్ ఒక కుర్రాడు ప‌నిపాట లేకుండా దేశం చుట్టూ తిర‌గ‌డం. నా క్యారెక్ట‌ర్ డ‌బ్బుతోనే మ‌నిషి బ‌తుకుతాడా డ‌బ్బు మ‌నిషికి ఇంత అవ‌స‌ర‌మా అన్న దాని మీద క‌థ‌. డ‌బ్బు అనేది కేవ‌లం అవ‌స‌రం అదే జీవిం కాదు అన్న కాన్సెప్ట్‌తో వ‌చ్చాను. ఈ చిత్రంతో నేను చాలా నేర్చుకున్నాను. ఇందులో నేను ఒక పాట‌ను కూడా పాడాను. మొద‌టిసారి పాడాను సుభాష్‌గారు పాడించారు. ఆయ‌న‌కు చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో మొత్తం 5 పాట‌లున్నాయి అంద‌రికీ న‌చ్చుతాయ‌ని అనుకుంటున్నాను అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All