Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందా ?

ఎన్టీఆర్ బయోపిక్ ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందా ?

Defferences between Nagarjuna and Sumanthనాగార్జునసుమంత్ లు మామా – అల్లుళ్ళు అన్న విషయం తెలిసిందే . నాగార్జున మేనమామ అయినప్పటికీ ఇద్దరు కూడా అన్నాదమ్ముల లాగే పెరిగారు . అయితే ఎన్టీఆర్ బయోపిక్ నాగార్జున – సుమంత్ ల మధ్య చిచ్చు పెట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . అసలే సుమంత్ కు నాగార్జున కు కాస్త ఎడమొహం పెడమొహం గా ఉంటున్న సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ నటించడంతో నాగ్ మరింతగా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ – అక్కినేని ల మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఒకరిని ఒకరు విపరీతంగా తిట్టుకున్నారు కూడా . అయితే 1994 తర్వాత ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు పూర్తిగా మర్చిపోయి మళ్ళీ ఒక్కటయ్యారు .

అయితే నాగేశ్వర్ రావు చివరి రోజుల్లో బాలయ్య తో అంతగా పడలేదంట ! ఆ కారణమో లేక మరో కారణమో కానీ అక్కినేని చనిపోతే బాలయ్య కనీసం చివరి చూపుకు కూడా పోలేదు . దాంతో నందమూరి – అక్కినేని కుటుంబాల మధ్య మరింత దూరం పెరిగింది . కట్ చేస్తే …… ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఉంటుంది కానీ అక్కినేని కి అంతగా ప్రాధాన్యత ఉండదు కదా ! అది తెలిసి కూడా సుమంత్ అక్కినేని పాత్ర ఎలా పోషిస్తాడని నాగ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం . అయితే అక్కినేని లుక్ లో సుమంత్ అచ్చు గుద్దినట్లు ఉండటంతో నాగ్ కోపం తగ్గిపోయిందట . అయినప్పటికీ సుమంత్ పై నాగార్జున కోపంగానే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే సుమంత్ మాత్రం అటువంటిదేమీ లేదని అంటున్నాడు . అంతేకదా ! నిజమే విబేధాలు ఉన్నాయని చెబుతారా ?

- Advertisement -

English Title: Defferences between Nagarjuna and Sumanth

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All