
దీప్తి సునయన..నెటిజన్లకు ఈమెను పరిచయం చేయాల్సిన అవసరం లేదు..షార్ట్ ఫిలిమ్స్ , టిక్ టాక్ వీడియోలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈమె..యూట్యూబర్ షన్ను తో ప్రేమాయణం సాగించి మరింత పాపులర్ అయ్యింది. అంత బాగానే ఉంది..పెళ్లి చేసుకుందాం అనుకునేటైం లో షన్ను కు బిగ్ బాస్ ఆఫర్ రావడం ..అక్కడ సిరి తో క్లోజ్ అవ్వడం తో దీప్తి కి ఎక్కడో కాలింది..ఆ తర్వాత షన్ను కు బ్రేక్ అప్ చెప్పి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత షన్ను కూడా దీప్తి కి బ్రేకప్ చెప్పి…ప్రస్తుతం తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే తాజాగా దీప్తి మాత్రం ఓ డాక్టర్ ను పట్టుకున్నట్లు తెలుస్తుంది.
దీప్తి సునయన తాజాగా తన సోషల్ మీడియాలో డాక్టర్ ఆనంద్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఆనంద్ అనే వ్యక్తితో చాలా చనువుగా ఫోటోలు దిగి.. షేర్ చేసి.. మై బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పక్కన లవ్ సింబల్స్ పెట్టి అంత మాట్లాడుకునేలా చేసింది. ఇక ఈ ఫోటోలు చూసిన షన్ను ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. నిజంగా ఆనంద్ తో లవ్ లో ఉందా..లేక ఇద్దరు కలిసి ఏదైనా షార్ట్ ఫిలిం చేస్తున్నారా అనేది అర్ధం కావడం లేదు.