Homeటాప్ స్టోరీస్ఆశావహుల్లో దాస్యం వినయ్ భాస్కర్

ఆశావహుల్లో దాస్యం వినయ్ భాస్కర్

 Dasyam Vinay bhaskar eyes on promotionతెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే . కేసీఆర్ ముఖ్యమంత్రి గా రెండోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసారు , అయితే కేసీఆర్ తో పాటుగా మహమ్మద్ అలీ కూడా హోమ్ శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు . తెలంగాణ మంత్రి మండలి మొత్తం 18 మందికి మించకుండా ఉండాలి అయితే ఇప్పుడు కేసీఆర్ తో పాటుగా మహమ్మద్ అలీ మాత్రమే ఉన్నారు కాబట్టి మరో 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది . దాంతో ఆశావహుల్లో పలువురు పేర్లు చక్కర్లు కొడుతున్నాయ్ . అందులో వరంగల్ జిల్లా నుండి యువ నేత దాస్యం వినయ్ భాస్కర్ పేరు కూడా వినిపిస్తోంది .

వరంగల్ జిల్లా కు చెందిన వినయ్ భాస్కర్ ఇప్పటి వరకు నాలుగుసార్లు అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు . మొదట 2009 లో తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ఎన్నికైన దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు . ఉద్యమ ఖిల్లా అయిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తాజాగా మరోసారి ఎన్నికయ్యాడు దాస్యం . యువ నేత అందునా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దాస్యం కేసీఆర్ మంత్రివర్గంలో తప్పకుండా అవకాశం వస్తుందని ఆశిస్తున్నాడు . అలాగే దాస్యం అనుచరులు కూడా పెద్ద ఎత్తున దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రిమండలి లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు . మరి కేసీఆర్ ఆలోచన ఎలా ఉందో .

- Advertisement -

English Title:  Dasyam Vinay bhaskar eyes on promotion

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All