Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ముస్లిం మహిళల నెయిల్ పాలిష్ పై రగడ

ముస్లిం మహిళల నెయిల్ పాలిష్ పై రగడ

Darul Uloom issues Fatwa which bans Muslim women using nail polishముస్లిం మహిళలు తమ గోళ్ళ కు నెయిల్ పాలిష్ వాడొద్దని , మెహందీ మాత్రమే వాడాలని హుకుం జారీ చేసాడు దారుల్ ఉలూమ్ ముఫ్తి ఇష్రార్ గౌర . ముస్లిం మహిళల పట్ల ఇప్పటికే పలుమార్లు రకరకాల ఫత్వాలు జారీ చేసారు ముస్లిం మత పెద్దలు కాగా ఇప్పుడు ముఫ్తి ఇష్రార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేలా ఉన్నాయి అంతేకాదు కొంతమంది నవ్వుకుంటున్నారు కూడా ఎందుకంటే నెయిల్ పాలిష్ పై నిషేధం ఏంటి ? అని . ముస్లిం మహిళలు కేవలం మెహందీ మాత్రమే వాడాలని అందుకు విరుద్దంగా నెయిల్ పాలిష్ వాడొద్దని హెచ్చరించడమే కాకుండా ముస్లిం మహిళలు కొంతమంది కొత్త పోకడలకు పోతున్నారని అందుకే ఈ బ్యాన్ అంటూ కొత్త వాదన తెస్తున్నారు .

- Advertisement -

ఇదంతా ఎందుకంటే ముస్లిం మహిళలు కూడా బ్యూటీ పార్లర్ కు వెళుతున్నారు అక్కడ తమ జుత్తు ని పొట్టిగా కత్తిరించుకోవడమే కాకుండా ఐబ్రోస్ చేయించుకుంటున్నారు అలాగే ఇతరత్రా ఫ్యాషన్ పోకడలకు పోతున్నారు అయితే ఇస్లాం లో ఇదంతా నిషేధం అని అంటున్నారు . మగాళ్లు మీసం ఎలా గైతే పెంచుకోరో అలాగే మహిళలు తమ జుత్తు ని కత్తిరించుకోరు . తరతరాలుగా రకరకాల ఫత్వా లు జారీ చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు . అయితే తాజాగా నెయిల్ పాలిష్ పై నిషేధం మాత్రం కొంతమందికి నవ్వు తెప్పిస్తోంది అందుకే నిరసనగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు .

English Title: Darul Uloom issues Fatwa which bans Muslim women using nail polish

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts