Homeటాప్ స్టోరీస్సూప‌ర్‌స్టార్ సినిమాకు మ‌ళ్లీ ఫ్లైట్ ని దించారుగా!

సూప‌ర్‌స్టార్ సినిమాకు మ‌ళ్లీ ఫ్లైట్ ని దించారుగా!

సూప‌ర్‌స్టార్ సినిమాకు మ‌ళ్లీ ఫ్లైట్ ని దించారుగా!
సూప‌ర్‌స్టార్ సినిమాకు మ‌ళ్లీ ఫ్లైట్ ని దించారుగా!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `క‌బాలి` చిత్రానికి ఆ సినిమా మేక‌ర్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పా. రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్ థాను నిర్మించిన ఈ సినిమా ప్ర‌చారం కోసం ప్ర‌త్యేకంగా ఫ్లైట్‌నే క‌బాలీ పోస్త‌ర్ల‌తో ముస్తాబు చేసి చ‌క్క‌ర్లు కొట్టించి హంగామా చేశారు. దీంతో `క‌బాలీకి కావాల్సినంత ప‌బ్లిసిటీ ల‌భించింది. సినిమాలో క‌థ లోపించినా ప‌బ్లిసిటీ, ర‌జ‌నీ మేనియా కార‌ణంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబ‌ట్టింది.

ఇప్పుడు ర‌జ‌నీ న‌టిస్తున్న తాజా చిత్రానికి కూడా మేక‌ర్స్ అదే స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ న‌టిస్తున్న చిత్రం `ద‌ర్బార్‌`, ఎ.ఆర్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 9న తెలుగు, త‌మిళ‌. హిందీ భాష‌ల్లో రిలీజ్‌కాబోతోంది. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి విల‌న్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చాలా ఏళ్ల త‌రువాత తలైవ‌ర్ ర‌జ‌నీకాంత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 3న హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌బోతోంది.

- Advertisement -

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ భారీగా ప‌బ్లిసిటీని ప్లాన్ చేశారు. రిలీజ్‌కి సరిగ్గా వారం గ‌డువే వుండ‌టంతో ప్ర‌చారాన్ని హోరెత్తించాని ప్లాన్స్ మొద‌లుపెట్టారు. ఇందు కోసం ఓ ఫ్లైట్‌ని ద‌ర్బార్ థీమ్ స్టిక్క‌ర్ల‌తో రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇవి ర‌జ‌నీ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

???

A post shared by Anirudh (@anirudhofficial) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All