Homeటాప్ స్టోరీస్మే రెండవ వారం రిలీజ్ సన్నాహాలలో `ద‌మ్ముంటే సొమ్మేరా`

మే రెండవ వారం రిలీజ్ సన్నాహాలలో `ద‌మ్ముంటే సొమ్మేరా`

dammunte-sommera-to-release-in-may-2nd-weekసంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళ్ రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత న‌ట‌రాజ్ ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. మే రెండవ వారం సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పుర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత నటరాజ్ మాట్లాడుతూ: సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళ్ రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తున్నాము.ఇటివల విడుదల చేసిన ట్రైల‌ర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ సభ్యుల అభినందనలను పొందడంతో ఈ సినిమా పై మాకు వున్న నమ్మకం రెట్టింపుఅయ్యింది.హీరో సంతానం కు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. త‌మిళంలో పెద్ద నిర్మాణ సంస్థ చేసిన ఈ సినిమా ను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ ద్వారా మేము రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది. మే రెండవ వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని అన్నారు.

- Advertisement -

శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ న‌ర‌సింహారెడ్డి మాట్లాడుతూ: మే రెండవ వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము.స్టార్ కమెడియన్ అయిన సంతానంకు తమిల్ లోనే కాదు తెలుగు లొ కుడా మంచి గుర్తింపు వుంది. త‌ప్ప‌కుండా సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All