Homeటాప్ స్టోరీస్తమిళ్ లో హిట్టు మరి ఇక్కడో

తమిళ్ లో హిట్టు మరి ఇక్కడో

dammunte sommeraa gets possitive talk తమిళనాట కామెడీ స్టార్ అయిన సంతానం హీరోగా నటించిన తమిళ చిత్రం ” దిల్లుడు దుడ్డు ” 2016 లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది . కాగా ఆ చిత్రాన్ని తెలుగులో ” దమ్ముంటే సొమ్మేరా ” పేరుతో డబ్ చేసారు . రేపు ఈ సినిమా తెలుగునాట విడుదల అవుతోంది . తమిళనాట సంచలనాత్మక చిత్రాలను అందించిన సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది . హర్రర్ చిత్రాలు విజయవంతం అవుతున్న నేపథ్యంలో ఆ జోనర్ లోనే ఈ సినిమా తెరకెక్కి అక్కడ సూపర్ హిట్ అయింది .

రాంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగునాట శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై నటరాజ్ అందిస్తున్నాడు . సంతానం సరసన అంచల్ సింగ్ నటించగా ఇతర పాత్రల్లో కరుణాస్ , సురబ్ శుక్లా , ఆనంద్ రాజ్ తదితరులు నటించారు . అయితే తమిళనాట విజయం సాధించిన ఈ దమ్ముంటే సొమ్మేరా ఇక్కడ కూడా హిట్ అవుతుందా ? లేదా తెలియాలంటే రేపు ఈ సమయం వరకు ఎదురు చూడాల్సిందే ఎందుకంటే రేపే విడుదల కాబట్టి . అయితే సినిమా తమిళనాట హిట్ కావడంతో ఒకరోజు ముందుగానే మీడియాకు షో వేసారు . షో ప్రకారం టాక్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది , మరి ప్రేక్షకులకు చేరువ అయితేనే హిట్ అవుతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All