Homeటాప్ స్టోరీస్దహనం మూవీ రివ్యూ

దహనం మూవీ రివ్యూ

దహనం మూవీ రివ్యూ
దహనం మూవీ రివ్యూ

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది దహనం సినిమా. ఆదిత్య ఓం హీరోగా నటించిన ఈ సినిమాను డా. పీ సతీష్‌ కుమార్‌ నిర్మించారు. అడారి మూర్తి సాయి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే అవార్డులు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. నేడు (మార్చి 31) ఈ సినిమాను థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ:
80వ దశకంలో విశాఖ జిల్లాలోని వాడరేపు పల్లి గ్రామంలో దహనం కథ జరుగుతుంది. ఆ ఊరి పురాతన శివాలయం, శివుడే ప్రాణంగా బతుకుతుంటాడు పూజారి భరద్వాజ శాస్త్రి (ఆదిత్య ఓం). తమ పూర్వీకులు ఆ గుడిని, గుడి మాణ్యాలను ధర్మం చేశారని, వాటిపై హక్కు తనకే ఉంటుందని, వాటిని లాక్కోవాలని ఆ ఊరి పెద్ద భూపతి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఊరి కాపరి భైరాగి (ఎఫ్‌ఎం బాబాయ్) భరద్వాజ శాస్త్రిని దేవుడిలా భావిస్తాడు. అయితే గుడిని, శివుడినే ప్రాణంగా భావించే శాస్త్రికి ఆ గుడి శ్మశానంలా ఎందుకు అనిపించింది? గుడిని చివరకు ఎలా కాపాడుకుంటాడు? ఈ ప్రయత్నంలో భైరాగి చేసిన పనులేంటి? భూపతి చివరకు ఏం చేశాడు? అన్నది కథ.

- Advertisement -

నటీనటులు:
ఆదిత్య ఓం తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఓం అద్భుతంగా నటించారు. పాత్ర స్వభావానికి తగ్గట్టుగా కదలడం, నడవడం, మాట్లాడటం అన్నీ కూడా ఎంతో పర్ఫెక్షన్‌గా అనిపిస్తుంది. ఆదిత్య ఇలా నటించడం, కనిపించడం ఇదే మొదటి సారి. భైరాగి పాత్రలో ఎఫ్‌ఎం బాబాయ్ అద్భుతంగా నటించేశారు. ఆయన పాత్రను మలిచిన తీరు సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. భూపతి, అనసూయ, వైదేహీ, సాంబ, ఆదమ్మ పాత్రలు అన్నీ కూడా మెప్పిస్తాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

విశ్లేషణ:
దహనం సినిమాలో సమాజంలో నాడు, నేడు ఉన్న సమస్యలను చూపించారు. కుల వివక్షలపై విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. భైరాగి పాత్రతో సమాజాన్ని ప్రశ్నించారు. భక్తి, దేవుడు, దైవత్వం అంటే ఏంటో భరద్వాజ శాస్త్రి పాత్ర రూపంలో చూపించారు. ఆకలి కేకలకు కులమతాలు ఉండవని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా దహనం సినిమాలో ఎన్నో అంశాలపై చర్చించారు.

సినిమా నిడివి తక్కువే ఉన్నా కూడా.. కథనం నెమ్మదిగా సాగుతుంది. దీంతో ప్రేక్షకుడికి కాస్త సహన పరీక్షలా ఉంటుంది. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా.. నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించారు. కథానుసారంగానే మాటలు, పాటలుంటాయి. మాటలే కాదు పాటలు కూడా ఆలోచింపజేస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.

సినిమా కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, విలేజ్ వాతావరణాన్ని చక్కగా చూపించారు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ విభాగానికి సంబంధించిన పని ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

రేటింగ్ : 2:75/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All