Homeటాప్ స్టోరీస్కోటి దీపోత్సవం వేళ NTV పై కుటిల ప్రయత్నాలు

కోటి దీపోత్సవం వేళ NTV పై కుటిల ప్రయత్నాలు

ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్ర చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసిందంటూ జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదంటున్నాయి నరేంద్రచౌదరి సన్నిహితవర్గాలు. నరేంద్రచౌదరికి ఈడీ నోటీసులంటూ కొన్ని ప్రసారమాధ్యమాల్లో తప్పుడు కథనలు వెలువడ్డాయి.. అయితే, ఇదంతా వట్టిమాటే.. ఈడీ నోటీసులంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.

- Advertisement -

ప్రతీ ఏడాది కార్తిక మాసంలో ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ‘కోటీదీపోత్సవం’ నిర్వహిస్తూ వస్తున్నారు నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు.. 2012లో రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల సంకల్పంతో ఈ దీపోత్సవానికి అంకురార్పణ జరిగింది.. తొలిసారిగా లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. మరుసటి ఏడాది నుంచే కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది.. ఈ ఏడాది.. ఈ నెల 31వ తేదీ నుంచి మళ్లీ కోటీదీపోత్సవం ప్రారంభం కాబోతోంది.. ఈ పనుల్లో బిజీగా ఉన్నారు చౌదరి.. ఈ సమయంలో.. కోటిదీపోత్సవం నుంచి దృష్టి మరల్చడానికి కొందరి కావాలని ఈ దుష్ప్రచారానికి తెరలేపినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All