Homeటాప్ స్టోరీస్మహర్షి టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు

మహర్షి టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు

మహేష్ బాబు నటిస్తున్న మహర్షి టీజర్ ని నిన్న ఉగాది పండగ కాబట్టి ఆ సందర్భంగా విడుదల చేసారు . ఆ టీజర్ తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ ని సాధించిన టీజర్ గా రికార్డుల మోత మోగిస్తోంది . అయితే మహర్షి టీజర్ రికార్డుల మోత మోగిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ .

- Advertisement -

ఎందుకంటే ఈ టీజర్ అచ్చం శ్రీమంతుడు చిత్రాన్ని పోలి ఉంది తప్ప ఎక్కడా కొత్తదనం లేదని అందుకు ఉదాహరణగా టీజర్ లో ఉన్న సన్నివేశాలనే చూపిస్తున్నారు , కామెంట్ చేస్తున్నారు మహేష్ యాంటీ ఫ్యాన్స్ . మహేష్ యాంటీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్న విమర్శలలో కూడా వాస్తవం ఉందనిపిస్తోంది .

శ్రీమంతుడు చిత్రంలో కొన్ని లొకేషన్ లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా టీజర్ లో ఉన్న లొకేషన్ లు కూడా అవే కావడంతో మహర్షి కాదు శ్రీమంతుడు 2 అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All