Thursday, November 24, 2022
Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ కు క్రేజ్

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు క్రేజ్

Craze for Lakshmi's NTR ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబు నాయుడు హీరో అనేలా చూపించడంతో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కాగా ఈరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి కూడా అంతగా ఓపెనింగ్స్ లేవు దానికి తోడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర హైలెట్ గా నిలిచింది .

- Advertisement -

 

అయితే ఎవరు అవునన్నా కాదన్నా 1995 లో ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసింది చంద్రబాబు నాయుడే ! అందుకు సహకరించింది హరికృష్ణ , బాలకృష్ణలు . ఇవన్నీ ఇప్పటి జనాలకు బాగా తెలుసు అలాంటిది ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబు నాయుడు ని మహానాయకుడు గా చూపించారు దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చేలా జగన్ మీడియా ఉండనే ఉంది . దాంతో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి క్రేజ్ పెరిగింది .

English Title: Craze for Lakshmi’s NTR

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts