Homeగాసిప్స్ఆ సినిమాపై కోర్టుకెక్కారు

ఆ సినిమాపై కోర్టుకెక్కారు

Court case on Hansika's Maha movie
Hansika Motwani

అందాల భామ హన్సిక కథానాయికగా తెరకెక్కిన చిత్రం ” మహా ” . ఇటీవలే ఈ సినిమా పోస్టర్ విడుదల చేసారు . మహా ఫస్ట్ లుక్ పెద్ద వివాదాన్ని రాజేసింది . కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక ఓ మహారాజా చెయిర్ లో కూర్చొని ధూమపానం చేస్తూ ఇచ్చిన ఫోజే ఈ వివాదానికి కారణం అయ్యింది . ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే వివాదాలు చుట్టముట్టడం ఖాయమని టాలీవుడ్ రాసింది . ఇప్పుడు అదే నిజమయ్యింది .

హిందువుల మనోభావాలు కించపరిచేలా హన్సిక పోస్టర్ ఉందని , ఇక సినిమాలో ఎంత దారుణంగా చూపించారో అంటూ తమిళనాడు లో కోర్టుకెక్కారు హిందూ సంస్థలు . యు ఆర్ జమీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మహా చిత్రం హన్సిక కు యాభయ్యవ చిత్రం కావడం విశేషం . అయితే ఆ జోష్ ఎంతోసేపు నిలవలేదు పాపం హన్సిక కు . మహా చిత్రంపై కేసు పెట్టడంతో కోర్టు విచారణకు స్వీకరించింది . కోర్టు తీర్పు ని బట్టి హన్సిక సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది మరి .

- Advertisement -

English Title:  Court case on Hansika’s Maha movie

 Image result for hansika motwani
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All