Homeటాప్ స్టోరీస్నాగార్జున ఫామ్ హౌజ్ లో భార్యాభర్తల మృతి

నాగార్జున ఫామ్ హౌజ్ లో భార్యాభర్తల మృతి

Couple found dead in nagarjuna farmhouseఅక్కినేని నాగార్జున ఫామ్ హౌజ్ లో భార్యాభర్తలు మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది . గతనెలలో అన్నపూర్ణ స్టూడియోలో 53 ఏళ్ల వర్కర్ చనిపోవడం వివాదాస్పదం అయ్యింది అంతేకాదు ఆ శవాన్ని వెంటనే ఎక్కడో దూరంగా ఉన్న ఆసుపత్రి కి తరలించడం మరింత వివాదాన్ని సృష్టించింది కట్ చేస్తే ….. ఇప్పుడేమో నాగార్జున ఫామ్ హౌజ్ లో భార్యాభర్తలు కరెంట్ షాక్ తో చనిపోవడం మరింత సంచలనం గా మారింది .

నగర శివారులో నాగార్జున కు ఫామ్ హౌజ్ ఉంది కాగా ఆ ఫామ్ హౌజ్ లో తూర్పు గోదావరి జిల్లా కు చెందిన భార్యాభర్తలు వెంకటరాజు (32) దుర్గ (30 ) లు పనిచేస్తున్నారు . అయితే నిన్నటి రోజున పొలం పనుల్లో భాగంగా కరెంట్ వైర్ల ని చూస్తుండగా షాక్ కి గురయ్యాడు వెంకటరాజు , సరిగ్గా అదే సమయంలో కరెంట్ వైర్ తెగిన చోట తగలడం తో షాక్ తగిలింది దాంతో అక్కడికక్కడే వెంకటరాజు చనిపోయాడు , కళ్ళముందే భర్త కు షాక్ తగలడంతో అతడ్ని కాపాడాలని ప్రయత్నించి ఆ షాక్ కి గురయ్యింది దుర్గ …….. ఇద్దరు కూడా కరెంట్ షాక్ తో చనిపోయారు . ఫామ్ హౌజ్ లో ఉండి పనులు చూసుకునే వెంకట్ రాజు – దుర్గ లు చనిపోవడంతో నాగార్జున ఫామ్ హౌజ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి . ఇటీవలే ఆఫీసర్ చిత్రంతో డిజాస్టర్ ని అందుకుని షాక్ లో నాగార్జున కు ఫామ్ హౌజ్ ఇన్సిడెంట్ కూడా పెద్ద షాకింగ్ న్యూసే !

- Advertisement -

English Title: Couple found dead in nagarjuna farmhouse

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All