Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ని ఓడించి సోనియాకు కానుకగా ఇస్తారట

కేసీఆర్ ని ఓడించి సోనియాకు కానుకగా ఇస్తారట

Congress leaders hopes on telangana electionsడిసెంబర్ 9 సోనియాగాంధీ పుట్టినరోజు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో గెల్చి ఆమెకు జన్మదిన కానుకగా ఇస్తామని , కేసీఆర్ ని ఓడిస్తామని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ లో డిసెంబర్ 7న ఎన్నికలు అలాగే డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని అంటే సోనియాగాంధీ పుట్టినరోజు కి రెండు రోజుల ముందు ఓటింగ్ రెండు రోజుల తర్వాత కౌంటింగ్ ఇదే మా విజయానికి సూచిక అని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చామని సరిగ్గా చెప్పుకోలేకపోయామని , కానీ ఇప్పుడు ఆపరిస్థితి లేదని డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలే కేసీఆర్ కు ముహుర్తాల మీద అపారమైన నమ్మకం , సరిగ్గా అలాంటి సమయంలోనే అంటే అమావాస్య రోజున ఎన్నికల ఓటింగ్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏ ముహూర్త బలాన్ని నమ్ముకొని ఎన్నికల్లో దిగాడో ఆ ముహూర్తమే కేసీఆర్ కు భస్మాసుర హస్తం అవుతుందని , కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ లో అధికారం కేసీఆర్ ది కానీ కాంగ్రెస్ లో మాత్రం అలా లేదు. ఇప్పటికే ఓ 20 మంది వరకు ముఖ్యమంత్రి నేనంటే నేను అంటూ పోటీ పడుతున్నారు. ఇక ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని ఆశించే వాళ్ళ సంఖ్య మరింతగా పెరగడం ఖాయం , ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ కదా ! ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు భావిస్తుండగా , మళ్లీ అధికారం మాదే అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్ లో అసలు విషయం తేలిపోనుంది.

- Advertisement -

English Title: Congress leaders hopes on telangana elections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All