Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను చిత్రంపై ఫిర్యాదు

భరత్ అనే నేను చిత్రంపై ఫిర్యాదు

complaint on bharat ane nenuమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రానికి వివాదాలు చుట్టుముడుతున్నాయి . ఇప్పటికే భరత్ అనే నేను చిత్ర కథ నాదే అంటూ ఓ వ్యక్తి రచయితల సంఘం ని ఆశ్రయించగా తాజాగా భరత్ అనే నేను చిత్రంలో ” నవోదయం ” అనే పార్టీ ని యాజిటీజ్ గా పెట్టడమే కాకుండా నా గుర్తు ని కూడా వాడుకొని నవోదయం అనే పార్టీ అవినీతికి ఆలవాలం అయినట్లుగా చూపించి మమ్మల్ని ద్రోహులుగా చూపించారని ఇలాంటివి సహించేది లేదని గుంటూరు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసాడు నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు .

భరత్ అనే నేను చిత్రంలో నవోదయం అనే రాజకీయ పార్టీ ని చూపించడమే కాకుండా పార్టీ గుర్తు ని కూడా యాజిటీజ్ గా వాడారు దర్శకులు కొరటాల శివ . దాంతో ఈ సమస్య వచ్చింది . నల్లకరాజు ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన ఎస్పీ దర్యాప్తు చేస్తామని తెలిపారు . గతంలో కూడా మహేష్ బాబు – కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కు కూడా వివాదాలు చుట్టుముట్టాయి . మరి ఈ భరత్ అనే నేను చిత్రం ఆ వివాదాల నుండి ఎప్పుడు బయట పడుతుందో ! ఏప్రిల్ 20 న భారీ ఎత్తున విడుదలైన భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మైలురాయి ని అందుకుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All