Homeటాప్ స్టోరీస్వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి హిట్ అంటున్న కమెడియన్స్

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి హిట్ అంటున్న కమెడియన్స్

Comedians Praveen and Madhunandan hopes on Raai laxmi హాట్ భామ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి , ఆనంద్ రెడ్డి , ఆర్ కే రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి . హాస్య నటులు ప్రవీణ్ , మధునందన్ లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు . మార్చి 15 న ఈ చిత్రం రిలీజ్ అవుతుండటంతో ఆ చిత్ర విశేషాలను వెల్లడించారు ప్రవీణ్ – మధునందన్ లు .

* ఊళ్ళో అందరికీ సమస్యగా మారిన ఇద్దరు ఆవారాగాళ్ళు గా నేను , మధునందన్ నటించాం , ఊళ్లోకి వచ్చిన టీచర్ రాయ్ లక్ష్మి వెంట పడే సమయంలో మమ్మల్ని వాడుకుంటూ ఊళ్ళో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కొనేలా చేసిందనేదే వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రమని

- Advertisement -

అయితే సినిమా మొత్తం నవ్వులతో ఆసక్తికరంగా సాగుతుంది .

కథ విన్నప్పుడే తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం కుదిరింది అందుకే ఏమాత్రం అనుమానం లేకుండా ఈ సినిమా చేసాం , అలాగే రేపు రిలీజ్ అయ్యాక కూడా మా నమ్మకం నిజమని ప్రేక్షకులు నిరూపిస్తారన్న నమ్మకం ఉంది .

రాయ్ లక్ష్మి తో మేమిద్దరం చేసిన సన్నివేశాలు సినిమాలో హైలెట్ అవుతాయి , ప్రేక్షకులను నవ్వించడంతో పాటుగా కవ్విస్తాయి కూడా .

తెలుగు సినిమా రంగంలోనే ఎక్కువ మంది కమెడియన్ లు ఉన్నారు . ఎందుకంటే ప్రేక్షకులు వినోద భరితమైన చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు కాబట్టే . సినిమాల్లో మేమిద్దరం కలిసి నటించిన చిత్రాలు తక్కువే కానీ అంతకుమించిన ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి మా మధ్య అలాగే ఇతర నటీనటులతో కూడా మంచి కంఫర్ట్ ఉంది . ప్రతీ హీరోతో కూడా నటించడానికి ఇష్టపడతాం అంతేకాని ప్రత్యేకంగా ఫలానా హీరో అనేం లేదు . కమెడియన్ లు హీరోలుగా సక్సెస్ అయ్యారు అయితే లాంగ్ రన్ లేకపోవడానికి కారణం ఇతర జోనర్ లను ఎంచుకోవడమే ! ఓ కమెడియన్ హీరో అయ్యాడంటే రెండు గంటల పాటు నవ్విస్తాడని ఆశిస్తారు కానీ యాక్షన్ అంటూ ఇతర జోనర్ లను టచ్ చేయడమే ఫెయిల్యూర్స్ కి కారణం అనుకుంటా .

ఫైనల్ గా ……

రెండు గంటల పాటు హాయిగా ప్రేక్షకులను నవ్వించే చిత్రం మా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి అంటూ సెలవు తీసుకున్నారు ప్రవీణ్ – మధునందన్

English Title : Comedians Praveen and Madhunandan hopes on Raai laxmi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All