Homeటాప్ స్టోరీస్ఆ కమెడియన్ కు అంత రిస్క్ అవసరమా

ఆ కమెడియన్ కు అంత రిస్క్ అవసరమా

comedian saptagiri as gajadongaకమెడియన్ గా రాణించిన వాళ్ళు హాయిగా ఆ పని చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ అప్పుడప్పుడు హీరో వేషాలు వేసుకుంటే బాగుండేదేమో కానీ కొంతమంది మాత్రం హీరో అని ఫిక్స్ అయిపోయి కెరీర్ ని పాడు చేసుకుంటున్నారు . ఇప్పటికే ఆ లిస్ట్ లో పలువురు కమెడియన్ లు చేరగా సప్తగిరి కూడా హాస్య పాత్రలను పక్కన పెట్టి హీరో అని ఫిక్స్ అయ్యాడు . ఇప్పటికి రెండు సినిమాలు చేసాడు ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి అయినప్పటికీ ఖాతరు చేయకుండా తాజాగా మరో సినిమాలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు .

ఇక ఇంతకుముందు హీరోగా చేసినప్పటికీ హాస్యాన్ని మాత్రం వీడలేదు కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా యాక్షన్ హీరోగా సత్తా చాటాలని ట్రై చేస్తున్నాడట . తాజాగా రామకృష్ణ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ” గజదొంగ ” చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు సప్తగిరి . ఇక ఈ సినిమాలో కామెడీ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట . దాంతో ఈ కమెడియన్ కు అంత రిస్క్ అవసరమా ? అని గొణుగుతున్నారు . సప్తగిరి హాస్య నటుడిగా రాణించాడు , చాలా బిజీ గా ఉన్న సమయంలో ఇలా హీరో అయిపోయి కామెడీ వేషాలు వేయడం మానేసాడు ఏంటో .

- Advertisement -

English Title: comedian saptagiri as gajadonga

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All