Homeటాప్ స్టోరీస్హాస్య నటుడు గుండు హన్మంతరావు కన్నుమూత

హాస్య నటుడు గుండు హన్మంతరావు కన్నుమూత

comedian gundu hanmantharao passed away,ప్రముఖ హాస్య నటుడు గుండు హన్మంతరావు (61) తుదిశ్వాస విడిచారు . ఈరోజు తెల్లవారు జామున 3. 30 నిమిషాలకు హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని స్వగృహంలో కన్నుమూశాడు గుండు హన్మంతరావు . గతకొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు దాంతో తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అలాగే మెగాస్టార్ చిరంజీవి 2 లక్షల సహాయాన్ని అందించారు . ఇటీవలి కాలం వరకు ఆసుపత్రిలో చికిత్స పొందిన గుండు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే రాత్రి మరింతగా ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచాడు .

 

- Advertisement -

400 కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసాడు గుండు హన్మంతరావు . నాటక రంగం నుండి వచ్చిన వ్యక్తి కావడంతో నటనలో తనదైన ముద్ర వేసాడు . గుండు హన్మంతరావు కు భార్య ఒక కూతురు , ఒక కొడుకు సంతానం కాగా ఇదివరకే భార్య , కూతురు చనిపోయారు . అహనా పెళ్ళంట వంటి సిల్వర్ జూబ్లీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన గుండు హన్మంతరావు పలు టివి సీరియల్ లలో కూడా నటించాడు అలాగే పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు . గుండు హన్మంతరావు మరణంతో చిత్ర పరిశ్రమ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All