Homeఎక్స్ క్లూసివ్ఇంతకీ ఆలీ చేరేది ఏ పార్టీలోకి

ఇంతకీ ఆలీ చేరేది ఏ పార్టీలోకి

Comedian Ali political entry in dilemma
Comedian Ali political entry in dilemma

హాస్య నటుడు ఆలీ ఆమధ్య జగన్ తో ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఈనెల 9 న వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని , అలాగే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నాడని వార్తలు వచ్చాయి . అయితే ఆలీ పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహితుడు దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలీ ని ఓ ఆట ఆడుకున్నారు సోషల్ మీడియాలో , దాంతో పవన్ కళ్యాణ్ ని కలిసాడు . పవన్ కూడా ఆలీ కి మంచి ఆఫర్ ఇచ్చాడట వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేయమని .

ఆలీ జగన్ , పవన్ లతోనే ఆగిపోలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కూడా వెళ్లి కలిసాడు దాంతో మరింత డోలాయమానంగా తయారయ్యింది పరిస్థితి . అసలు ఆలీ ఏ పార్టీలో చేరతాడు , ఎక్కడి నుండి పోటీ చేస్తాడు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది . ఆలీ కి నిజంగా చిత్రమైన పరిస్థితి వచ్చింది రాజకీయాల వల్ల , జగన్ అధికారంలోకి రాబోతున్నాడని అందులో చేరుదామనుకుంటే పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు , అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆలీ కి దాంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారయ్యింది ఆలీ పరిస్థితి .

- Advertisement -

English Title: Comedian Ali political entry in dilemma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All