Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ పై రాళ్ల దాడి

రజనీకాంత్ పై రాళ్ల దాడి

రజనీకాంత్ పై రాళ్ల దాడి
రజనీకాంత్ పై రాళ్ల దాడి

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ షూటింగ్ లో రజనీకాంత్ పాల్గొన్న సమయంలో కొంతమంది రౌడీ విద్యార్థులు రాళ్ల దాడి చేసారు . అయితే ఈ రాళ్ల దాడిలో రజనీకాంత్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నారు . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబాయి లో షూటింగ్ జరుపుకుంటోంది .

ఓ ప్రైవేట్ కళాశాలలో దర్బార్ షూటింగ్ జరుగుతోంది . అయితే షూటింగ్ ని చూడటానికి పెద్ద ఎత్తున ఆ కళాశాలకు చెందిన స్టూడెంట్స్ తోసుకు వస్తుండటంతో వాళ్ళందరిని షూటింగ్ లొకేషన్ లోకి అనుమతి ఇవ్వలేదు దాంతో మా కాలేజ్ లోనే షూటింగ్ చేసుకుంటూ మా పై ఆంక్షలు విధిస్తారా ? అంటూ తీవ్ర ఆగ్రహంతో బిల్డింగ్ పైకి ఎక్కి రాళ్ళతో దర్బార్ చిత్ర బృందం పై దాడికి పాల్పడ్డారు . అయితే బిల్డింగ్ దూరంగా ఉండటం వల్ల రజనీకాంత్ కు కానీ మిగతా దర్బార్ బృందానికి కానీ ఎలాంటి గాయాలు కాలేదు దాంతో అక్కడి నుండి షూటింగ్ చేయకుండా వెళ్లారు . ఈ సంఘటన కు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All