Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్చూసీ చూడంగానే మూవీ రివ్యూ

చూసీ చూడంగానే మూవీ రివ్యూ

చూసీ చూడంగానే మూవీ రివ్యూ
చూసీ చూడంగానే మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: చూసీ చూడంగానే
న‌టీన‌టులు: శివ కందుకూరి, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, మాళ‌విక స‌తీష‌న్‌,
నిర్మాత‌: రాజ్ కందుకూరి
ద‌ర్శ‌క‌త్వం: శేష సింధూరావు
ఫొటోగ్ర‌ఫీ: వేద‌రామ‌న్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్: ర‌వితేజ గిరిజాల‌
రేటింగ్‌: 2.75/5

- Advertisement -

నిర్మాత‌గా ఎన్నో చిత్రాల్ని నిర్మించారు రాజ్ కందుకూరి. అయితే ఆయ‌న‌కు ఓ నిర్మాత‌గా గుర్తింపుని తీసుకొచ్చిన చిత్రం `పెళ్లిచూపులు`. శ్రీ‌విష్ణుతో `మెంట‌ల్ మ‌దిలో` చిత్రాన్ని నిర్మించిన ఆయ‌న కొంత విరామం తీసుకుని త‌న త‌న‌యుడు శివ కందుకూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం `చూసీ చూడంగానే`. శేష సింధూరావుని ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి త‌న త‌న‌యుడితో నిర్మించిన చిత్రంతో ఆక‌ట్టుకున్నారా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
సిద్దూ (శివ కందుకూరి) త‌న త‌ల్లి (ప‌విత్రాలోకేష్‌) కార‌ణంగా త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా వుండ‌లేక‌పోతుంటాడు. త‌ల్లి మాట‌ని కాద‌న‌లేక‌, త‌న‌కు న‌చ్చిన‌ట్టు వుండ‌లేక త‌న‌లో త‌నే సంఘ‌ర్ష‌ణ ప‌డుతూనే త‌న‌కు న‌చ్చ‌ని బీటెక్‌లో చేర‌తాడు. కాలేజీలో ఐశ్వ‌ర్య‌(తో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అలా నాలుగేళ్లు గ‌డిచిపోతాయి. ఆ త‌రువాత సిద్దూకు ఐశ్వ‌ర్య (మాళ‌విక స‌తీష‌న్‌) బ్రేక‌ప్ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ షాక్‌లో వున్న సిద్దూ వెడ్డింగ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిపోతాడు. ఓ వెడ్డింగ్‌లో శృతిరావుతో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అయితే సిద్ధూని కాలేజీ డేస్ నుంచే శృతి ఫాలో అవుతోంద‌ని, అత‌న్ని ప్రేమిస్తోంద‌ని బ‌య‌ట‌ప‌డుతుంది. మ‌రి ఆ విషయం శృతి ఎందుకు దాచింది?. శృతికి, ఐశ్వ‌ర్య‌కి మ‌ధ్య వున్న అనుబంధం ఏమిటి?. చివ‌రికి సిద్దూ, శృతిల ప్రేమ ఎలా సుఖాంత‌మైంది అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్పిందే.

న‌టీన‌టులు:
రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరికి హీరోగా ఇది తొలి సినిమా అయినా న‌టుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. కేవ‌లం నాలుగు పాత్ర‌ల చుట్టూ రితిగే ఈ క‌థ‌లో ఇద్ద‌రు అమ్మాయితో ప్రేమ‌లో ప‌డే యువ‌కుడిగా కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపించాడు. కొన్ని స‌న్నివేశాల్లో డ‌ల్‌గా క‌నిపించాడు. న‌ట‌న ప‌రంగా కొంత మెరుగ కావాల్సిన అవ‌స‌రం వుంది. ఇక హీరోయిన్‌లుగా న‌టించిన వ‌ర్షా బొల్ల‌మ్మ‌, మాళ‌విక స‌తీష‌న్ త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు, త‌ల్లి పాత్ర‌లో ప‌విత్రా లోకేష్ ప‌రిధుల మేర‌కు న‌టించింది. అంతకు మించి ఇందులో చెప్పుకోద‌గ్గ న‌టీన‌టులు లేరు. ఉన్నా వాళ్ల‌లో కొంత మంది కామెడీని పండించి ఆక‌ట్టుకున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ గెస్ట్ పాత్ర‌లో మెరిసారు. ఫాద‌ర్ పాత్ర‌లో అనీష్ కురువిల్లా ప్రాధాన్య‌త లేని పాత్ర‌లో క‌నిపించారు.

సాంకేతిక నిపుణులు:
సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాల్సి వ‌స్తే ముందుగా సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్ గురించి ప్ర‌ధ‌మంగా చెప్పుకోవాలి. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో వ‌రుస మ్యూజిక‌ల్ హిట్స్‌ని అందించిన ఆయ‌న ఈ చిత్రానికి కూడా ఆ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్రేమ‌క‌థా చిత్రం కావ‌డంతో మంచి మెలోడీ సాంగ్స్ అందించారు. ప్రేమ క‌థా చిత్రానికి ఫొటోగ్ర‌ఫీ మెయిన్ ఎస్సెట్‌గా నిలుస్తుంటుంది. ఆ విష‌యంలో వేద‌రామ‌న్ విఫ‌ల‌మ‌య్యాడు. క్రిస్పీగా వుండాల్సిన ఎడిటింగ్ కూడా మ‌రింత మెరుగ్గా వుండాల్సింది. న‌రేష‌న్ చాలా మంద‌గ‌మ‌నంలో న‌డిచిన మైన‌స్ అని చెప్పొచ్చు. ఈ విష‌యంలో ఎడిట‌ర్ ర‌వితేజ కూడా
ఫెయిల‌య్యాడు.

విశ్లేష‌ణ‌:
ప్రేమ క‌థ‌ని కొత్త పంథాలో ప్ర‌జెంజ్ చేయ‌డంలోనూ, క‌థ‌ని కొత్త‌గా రాసుకోవ‌డంతోనూ ద‌ర్శ‌కురాలు శేష సింధూరావు విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పొచ్చు. డ‌బ్బులు పెట్ట‌గ‌ల నిర్మాత‌, మంచి టెక్నీషియన్స్ అందుబాటులో వున్నా వారికి ప‌ని క‌ల్పించి సినిమాని కొత్త త‌ర‌హాలో తెరపైకి తీసుకురావ‌డంలో ద‌ర్శ‌కురాలు మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాల్సింది. త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న చిత్ం టెక్నిక‌ల్‌గా ఏవిష‌యంలోనూ త‌గ్గ‌కూడ‌ద‌ని ప్ర‌య‌త్నించిన రాజ్ కందుకూరి సినిమాకు ఆయువు ప‌ట్ట‌యిన క‌థ‌, క‌థ‌నాల‌పై దృష్టిపెట్ట‌క‌పోవ‌డం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్‌గా మారింది. ఓవ‌రాల్‌గా రాజ్ కందుకూరికి ఈ సినిమాతో ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts