Homeటాప్ స్టోరీస్మీట్ చిట్టి - ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్

మీట్ చిట్టి – ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్

మీట్ చిట్టి - ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్
మీట్ చిట్టి – ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్

గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తోన్న సినిమా ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్. టైటిల్ తో ఆకర్షించడంలో టీమ్ పూర్తిగా సక్సెస్ అయింది. ఈ చిత్రాన్ని కెఎల్ దామోదర్ ప్రసాద్ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. విద్యాసాగర్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రను పోషించాడు. ఆయన ఫాదర్ గా కనిపిస్తారు. 60లలో ఉన్నా కానీ 16లో వ్యక్తిగా బిహేవ్ చేస్తాడని టీమ్ అంటోంది. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది.

- Advertisement -

ఇక ఇప్పుడు రెండో పాత్రను పరిచయం చేసారు. బేబీ సహర్షిత ఈ సినిమాలో చిట్టిగా కనిపించనుంది. చాలా చిన్న పిల్లే అయినా ఆమె కథను కీలక మలుపును తిప్పుతుందని టీమ్ అంటోంది. అలాగే ఇంకా ఉమా, కార్తీక్ పాత్రలను కూడా పరిచయం చేయాల్సి ఉంది. అమ్ము అభిరామి, రామ్ కార్తీక్ ఈ పాత్రలను పోషించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All