Homeటాప్ స్టోరీస్చిరుతేజ్ సింగ్ బాలల చిత్రం

చిరుతేజ్ సింగ్ బాలల చిత్రం

Chiru Tej Singh Movie Pressmeetనిర్మాత N.S NAIK గారి సహాయసహకారాలతో అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డును నెలకొల్పిన గిరిజన బాలిక చిరుతేజ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడిన బాలల చిత్రం చిరుతేజ్ సింగ్. ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధానపాత్ర పోషించారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాల మేధావిగా ఎన్నో పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకొని తెలుగు జాతి,మరియు భారతదేశ ప్రతిష్టను పెంచిన చిరుతేజ్ సింగ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తల్లి కూతురి మధ్య ప్రేమ ,టీచర్ స్టూడెంట్ మధ్య వున్న ఆసక్తికరమైన మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతోమంది చిన్నారులకు ప్రేరణ కలిగించేలా రూపొందించబడినది. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అనాధ పిల్లకోసం అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేయడం జరిగింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీమతి సమంత అక్కినేని గారు తన అభినందనలు తెలియచేశారు. డైరెక్టర్ వీరశంకర్ గారు , అలాగే నిర్మాత శ్రీ రాజ్ కందుకూరి గారు ,దర్శకులు మధుర శ్రీధర్ గారు , సంగీత దర్శకులు రఘు కుంచె గారు , యువ హీరో అభిజిత్ , యువ దర్శకులు సాగర్ చంద్ర , యువ నటి సీత నారాయణ్, మరియు ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించడం జరిగింది.
CAST
మనాలి రాథోడ్ ,సౌమ్య వేణుగోపాల్ , చిరుతేజ్ సింగ్ , రాజశేఖర్ ,N.S నాయక్ ముఖ్యపాత్రలు పోషించారు.
నిర్మాత : N.S నాయక్
రచన దర్శకత్వం : డా.ఆనంద్ కుమార్
సహ నిర్మాత : మహేశ్ నునావత్
సంగీతం :గీతా పూనిక్
కెమె జై
ఎడిటింగ్ : యాదగిరి కంజర్ల
పోస్ట్ ప్రోడుక్షన్స్ లాక్స్ విల్, స్టూడియోస్ అజయ్ గార్మెంట్స్, కృషి N.G.O
స్టార్ మీడియా ఫోకస్ సమర్పణ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All