
మెగాస్టార్ చిరంజీవి వరుస రీమేక్ లతో బిజీ బిజీ గా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే లూసిఫర్, వేదాళం రీమేక్ లకు ఓకే చెప్పడం , సెట్స్ పైకి తీసుకెళ్లడం..రిలీజ్ డేట్స్ ప్రకటించడం వరకు వచ్చాయి. వేదాళం రీమేక్ భోళా శంకర్ ను దసరా బరిలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా..లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను ఆగస్టు 11 న తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్‌ఫాదర్ టైటిల్‌తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తియినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. గాడ్ ఫాదర్ సినిమాలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వరుసగా సెలవులు ఉండటమే దీనికి కారణమని తెలుస్తుంది. అయితే ఇదే తేదీన అఖిల్ ఏజెంట్, సమంత యశోద, అమీర్‌ఖాన్ లాల్సింగ్ చద్దా విడుదల కానున్నాయి. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.బీ.చౌదరి, ఎన్.వీ.ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఇదే డేట్ కు వస్తుందా..మారుతుందా అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.