
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా చరణ్ కు సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు విషెష్ అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే మెగా వారసుడు నిపించుకున్నాడు. ఆ తర్వాత తన రెండో సినిమా మగధీరతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. అప్పటినుండి ఓ వైపు మాస్ సినిమాల్లో నటిస్తూనే.. ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి విభిన్న సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.
తన కుమారిడి పుట్టినరోజు సందర్భంగా అరుదైన పిక్ ను షేర్ చేసిన చిరంజీవి “రామ్ చరణ్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నాకు వింతగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఒక పిక్ ని షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారని అన్పించింది. కొడుకుగా చరణ్ నన్ను గర్వపడేలా చేశాడు” అంటూ రామ్ చరణ్ మీద తనకు ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు. ఈ పిక్ లో రెండు సన్నివేశాలు ఉన్నాయి. ఒకవైపు చరణ్ చిన్నప్పుడు చిరు ఎత్తుకుని ఉన్న ఫోటో కనిపిస్తూ ఉండగా మరో వైపు ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన పిక్. అయితే రెండు పిక్స్ ఒకేలా ఉండటం గమనార్హం.