Homeటాప్ స్టోరీస్చిరు కోసం మెసేజ్ ఓరియెంటెడ్ సిద్ధం చేసిన వెంకీ

చిరు కోసం మెసేజ్ ఓరియెంటెడ్ సిద్ధం చేసిన వెంకీ

chiranjeevi venky kudumula movie update
chiranjeevi venky kudumula movie update

చిరంజీవి కెరియర్ లో ఠాగూర్ . స్టాలిన్ చిత్రాలు ఓ మైలు రాయి చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత మరో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రాలేదు. తాజాగా ఆ లోటును వెంకీ కుడుముల తీర్చబోతున్నట్లు తెలుస్తుంది. భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ..చిరంజీవి కోసం మెసేజ్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసి ఉంచాడట.

డీవీవీ దానయ్య నిర్మించబోతున్న ఈ సినిమాను జూన్ లో గ్రాండ్ గా లాంచ్ చేసి.. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారట. ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది . ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో ‘భోళాశంకర్, గాడ్ ఫాదర్’ చిత్రాలు జూలై నాటికి పూర్తి కానున్నాయి. ఇవి పూర్తి కాగానే వెంకీ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట. మరి ఈ మూవీ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All