
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ రేపు ఉగాది కానుకగా ప్రారంభం కాబోతుంది. వంశీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నుపుర్ సనన్ ను నటిస్తుంది. ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమానికి మెగాస్టార్ చిరంజీవి తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరుకాబోతున్నారు.
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్యనే ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రస్తుతం సెట్స్ ఫై ధమాకా , రామారావు చిత్రాలను ఉంచాడు. వీటిలో రామారావు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.